యాదాద్రి భువనగిరి జిల్లా, చౌటుప్పల్ మండల పరిధిలోని జెకేసారం గ్రామంలోని ఎస్సార్ కెమికల్ ల్యాబ్ పరిశ్రమలో శనివారం రాత్రి అగ్ని ప్రమాదం సంభవించింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. పరిశ్రమలో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడడంతో భయభ్రాంతులకు లోనైనా కార్మికులు బయటికి పరుగులు తీశారు. రియాక్టర్ పేరుతోందేమోనని గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. అగ్నిమాపక సిబ్బంది ఫైర్ ఇంజన్ సహాయంతో మంటలను ఆర్పుతున్నారు. కంపెనీ లోపలికి గ్రామస్తులు వెళ్లకుండా పోలీసులు అడ్డుకుంటున్నారు. దీంతో కొద్దిసేపు గ్రామస్తులకు, పోలీసులకు మధ్య స్వల్ప వాగ్వాదం చోటుచేసుకుంది.