మద్యం తాగి వాహనాలు నడిపితే చర్యలు: సీఐ విజయభాస్కర్ గోనెగండ్ల సేఫ్టీ డ్రైవర్ అసోసియేషన్ ఆవిర్భావ దినోత్సవాన్ని సోమవారం బస్టాండ్ ఆవరణంలో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సీఐ విజయభాస్కర్ మాట్లాడుతూ డ్రైవర్లు తమ కుటుంబాల గురించి ఆలోచిస్తూ, నియమ నిబంధనలు పాటిస్తూ వాహనాలు నడపాలని సూచించారు. మద్యం తాగి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. డ్రైవర్లు ఐకమత్యంగా ఉండాలని పిలుపునిచ్చారు.