రైతులకు సరిపడా యురియా అందించాలంటూ మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో రైతులు గురువారం మధ్యాహ్నం 12:00 లకు ప్రధాన రహదారిపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులకు,ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. యూరియా కోసం రైతులు కష్టాలు పడుతుంటే నాయకులు కనీసం వచ్చి పరిస్థితి తెలుసుకునే ప్రయత్నం చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.. గత నెల రోజుల నుండి యూరియా కోసం ఇబ్బందులు పడుతున్న ప్రభుత్వం రైతులను పట్టించుకోవడం లేదంటూ రైతులు ఆరోపించారు.