కరీంనగర్ లోయర్ మానేరు జలాశయం లోని రెండు గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేసిన విషయం తెలిసినదే.. మంగళవారం సాయంత్రం ఐదు గంటలకు నీటిని విడుదల చేసిన దృశ్యాలు డ్రోన్ వీడియోలు కనువిందు చేస్తున్నాయి. కిందికి వస్తున్న నీళ్లు చూపరులను ఆకట్టుకుంటున్నాయి.ఎల్ఎండి 920 అడుగుల నీటిమట్టానికి గాను 919.40 అడుగులకు చేరింది. మొత్తం 7642 ఇన్ఫ్లో వస్తుండగా స్పిల్ వే ద్వారా 4 వేల క్యూసెక్కులు, కాకతీయ కెనాల్ కు ఐదువేల క్యూసెక్కులు నీటి విడుదల చేస్తున్నారు.