కామారెడ్డి జిల్లా కేంద్రంలోని గాంధీ గంజిలో ఉన్న మార్కెట్ యార్డులో గురువారం తెల్లవారుజాము నుంచి రైతులు యూరియా కోసం పెద్ద ఎత్తున తరలివచ్చారు. గంటల తరబడి వేచి ఉన్నా యూరియా అందుబాటులో లేకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. సరైన సమయంలో వరి పంటకు యూరియా అందుబాటులో లేకపోవడంతో పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి తమకు యూరియా అందేటట్టు చూడాలని రైతుల కోరుతున్నారు.