లండన్ డిప్యూటీ మేయర్, భీమవరం మండలం తుందుర్రు గ్రామ వాసి ఆరేటి ఆర్యన్ ఉదయ్ గురువారం రాత్రి భీమవరంలో మాజీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా గ్రంధి శ్రీనివాస్ ఆయనను ఘనంగా సత్కరించారు. అనంతరం ఉదయ్ మాట్లాడుతూ 2005 లో గ్రంధి శ్రీనివాస్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు తనను టెన్నిస్, క్రికెట్ క్రీడాకారుడిగా గుర్తించి ప్రత్యేక సర్టిఫికెట్ ను ప్రభుత్వం ద్వారా ఇచ్చారని అన్నారు. తన ఎదుగుదలకు సహకరించిన గ్రంధి శ్రీనివాస్ కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో తుందుర్రు గ్రామ సర్పంచ్ ఆరేటి వీరాస్వామి నాయుడు,కొట్టి కుటుంబరావు, మద్దాల రమణ పాల్గొన్నారు.