గుత్తి మండలం ఇసురాళ్లపల్లి గ్రామంలోని రాఘవేంద్ర స్వామి ఆలయంలో శనివారం అర్ధరాత్రి తర్వాత చోరీ జరిగింది. దొంగలు దేవాలయంలోకి ప్రవేశించారు. నాలుగు హుండీలను ఎత్తుకెళ్లి అందులో ఉన్న సుమారు 30 వేల రూపాయలను అపహరించినట్లు పూజారి నరసింహాచారి ఆదివారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు చోరీ జరిగిన రాఘవేంద్ర స్వామి దేవాలయాన్ని పరిశీలించారు. కేసు దర్యాప్తు చేపట్టారు. దొంగల ఆచూకీ కొరకు పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.