కాసిపేట మండలం దేవాపూర్ ఓరియంట్ సిమెంట్ ఫ్యాక్టరీలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ లోడింగ్ కార్మికులు కంపెనీ గేటు ఎదుట విధులు బహిష్కరించి కార్మికులు ధర్నాకు దిగారు.ఓరియంట్ సిమెంట్ కంపెనీని అదాని తీసుకున్నప్పటినుండి వేధింపులు మొదలయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు.కాంట్రాక్టు విధానాన్ని తీసివేసి పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేశారు. వర్క్ క్యాలెండర్ చేసి తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని అన్నారు. గ్రాడ్యుయేట్ అలవెన్స్ ల విషయంలో ఇబ్బందులు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.కంపెనీ యాజమాన్యం దిగివచ్చేంత వరకు ఆందోళన చేపడతామని యాజమాన్యని హెచ్చరించారు