మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గం నవాబుపేట మండలం చౌడూరు పెద్ద చెరువు శనివారం అలుగు పారింది. భారీ వర్షాల కారణంగా చెరువు పూర్తిగా నిండింది. ఈ సందర్భంగా గ్రామస్థులు పెద్ద ఎత్తున చెరువు వద్దకు చేరుకుని గంగమ్మకు పూజలు చేశారు. వర్షాలు బాగా కురిసి పంటలు సమృద్ధిగా పండాలని వారు ఆకాంక్షించారు. ఈ ఏడాది మంచి వర్షాలు కురవడం పట్ల తాము సంతోషంగా ఉన్నామని