అనంతపురం జిల్లా బెలుగుప్ప మండల కేంద్రంలో శనివారం మధ్యాహ్నం నిర్వహించిన విలేకరుల సమావేశంలో టిడిపి జిల్లా కార్యదర్శి మల్లికార్జున మాట్లాడుతూ ఆర్థిక పరిస్థితులు అద్వాన్నంగా ఉన్న రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమాన్ని పరుగులు పెట్టిస్తోందని పేర్కొన్నారు. సూపర్ సిక్స్ పథకాలను అమలు చేస్తున్న వైఎస్సార్సీపీ నాయకులు ఓర్వలేక కావాలని విమర్శిస్తున్నారని పేర్కొన్నారు. గత ప్రభుత్వంలో పెండింగ్లో ఉన్న ఫసల్ బీమా పథకం నిధులు ప్రస్తుతం జిల్లాకు 77 కోట్ల మంజూరయ్యాయని ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఆవులన్న సర్పంచ్ రామ్మోహన్ జిల్లా టిడిపి నాయకులు పెద్ద తిప్పయ్య పాల్గొన్నారు.