Download Now Banner

This browser does not support the video element.

నరసాపురం: సరేపాలెం గ్రామంలో అభివృద్ధి పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే నాయకర్

Narasapuram, West Godavari | Aug 22, 2025
ప్రభుత్వ విప్, నరసాపురం నియోజకవర్గ శాసనసభ్యులు బొమ్మిడి నాయకర్ పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం నియోజకవర్గం సరేపాలెం గ్రామంలో రూ.20 లక్షల నిధులతో నిర్మించబడుతున్న 0.5 ఎం.ఎల్.డి. మైక్రో ఫిల్టర్ పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామ ప్రజలకు స్వచ్ఛమైన త్రాగునీరు అందించేందుకు ఈ మైక్రో ఫిల్టర్ నిర్మాణం చేపట్టబడింది అని అన్నారు. ప్రతి కుటుంబానికి ఆరోగ్యకరమైన త్రాగునీరు అందించడమే మా ముఖ్య లక్ష్యం. ప్రజల ఆరోగ్యం కోసం ప్రభుత్వం తీసుకుంటున్న ప్రతి చర్యను గ్రామ స్థాయిలో అమలు చేస్తాము అని అన్నారు. ఈ కార్యక్రమంలో నిప్పులేటి తారక రామారావు పాల్గొన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us