మహబూబ్ నగర్ నియోజకవర్గ పరిధిలో ప్రైవేటు టీచర్ల సంక్షేమం కోసం ప్రైవేట్ టీచర్స్ వెల్ఫేర్ ఫండ్ ఏర్పాటు చేస్తున్నట్లు ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాసరెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని అన్నపూర్ణ గార్డెన్ ఫంక్షన్ హాల్లో ట్రస్మా ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన గురుపూజోత్సవం కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా వెల్ఫేర్ అసోసియేషన్ కోసం తనవంతుగా రూ. 10 లక్షల ఇస్తున్నానని వెల్లడించారు.