శ్రీ సత్య సాయి జిల్లా పుట్టపర్తి లోని జిల్లా పోలీసు కార్యాలయం కాన్ఫరెన్స్ హాలులో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక ను జిల్లా ఎస్పీ వి రత్న ఐపిఎస్ నిర్వహించారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో కుటుంబ కలహాలు, భూ తగాదాలు, సైబర్ మోసాలు ,ఉద్యోగాలు, వ్యాపారల పేరుతో మోసాలు , తదితర వంటి సమస్యలపై ఈ రోజు మొత్తం 45 ఫిర్యాదులు వచ్చినట్టు ఫిర్యాదులపై సంబంధిత పోలీస్ అధికారులతో ఫోన్లో మాట్లాడి బాధితుల నుంచి వచ్చిన ఫిర్యాదులపై చట్ట పరిధిలో విచారించి న్యాయపరమైనటువంటి వాటికి సత్వరమే న్యాయం చేయాలని ఆదేశించారు.ఫిర్యాదు దారులకు చట్ట పరిధిలో న్యాయం చేస్తామని ఎస్పీ తెలిపారు.