నిజామాబాద్ జిల్లా జైలును న్యాయసేవ అధికార సంస్థ కార్యదర్శి, చీఫ్ డిఫెన్స్ కౌన్సిల్ రాజ్ కుమార్ సుబేదార్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన ఖైదీలను ఉద్దేశించి మాట్లాడుతూ న్యాయ వ్యవస్థ గురించి తెలియజేస్తూ, ఎవరైతే న్యాయవాదినీ నియమించుకునే స్తోమత లేదో వారికి తాము తమ తరపున ఉచితంగా న్యాయవాదినీ నియమిస్తూ వారికి ఉచిత న్యాయ సహాయం అందించడం జరుగుతుందని చెప్పారు. మహిళాల బ్యారక్ వద్దకు వెళ్లి, వారి సమస్యలను తెలుసుకొని వారికి కూడా చట్టాల గురించి వివరించారు.