మహిళలకు రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా గుర్తింపు తీసుకువచ్చింది స్వర్గీయ నందమూరి తారక రామారావు వల్లనే అని అదే ఒరవడిని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొనసాగిస్తూ మహిళ అభ్యున్నతికి కృషి చేస్తున్నారని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ అన్నారు స్త్రీ శక్తి పథకం విజయోత్సవ సభను తణుకులో కమ్మ కళ్యాణ మండపంలో గురువారం నిర్వహించారు. ఈ సభలో ఎమ్మెల్యే రాధాకృష్ణ మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ నేతృత్వంలో 90 శాతం హామీలను మొదటి ఏడాదిలోనే అమలు చేశారని అన్నారు.