ప్రజా సంక్షేమం కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న అన్ని అభివృద్ధి కార్యక్రమాలను కార్యదీక్షతో, అంకిత భావంతో పూర్చి చేసి.. ప్రజలకు ఎలాంటి కొరత లేకుండా చూడాలని.. వైఎస్ఆర్ కడప జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి పేర్కొన్నారు.శనివారం స్థానిక జిల్లా ప్రజా పరిషత్ సమావేశ మందిరంలో.. జెడ్పి చైర్మన్ రాంగోవిందరెడ్డి అధ్యక్షతన వైఎస్ఆర్ కడప, అన్నమయ్య ఉమ్మడి జిల్లాల జడ్పి సర్వ సభ్య సమావేశం జరిగింది.