ప్రభుత్వాసుపత్రిలో బాలింత మృతి పై విచారణకు జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా ఆదేశించారు.మంగళవారం జరిగిన ప్రభుత్వ వైద్యాధికారుల సమావేశంలో గత మూడు మాసాలలో జిల్లాలో సంభవించిన శిశు,మాతృ మరణాలపై సమీక్షించారు.ఈ క్రమంలో ఒక బాలింత మరణించినట్లు డీఎంహెచ్వో చెప్పగా కలెక్టర్ అందుకు దారి తీసిన కారణాలపై ఆరా తీశారు. సమగ్ర విచారణ జరిపించాలని ఆదేశించారు. మాతృ శిశు మరణాల నివారణకు వైద్యాధికారులు కృషి చేయాలన్నారు