నంగునూరు మండలం తహశీల్దారుగా టి.మాధవి ఆదివారం విధుల్లో చేరారు. నంగునూరు తహశీల్దారుగా పనిచేస్తున్న సరిత మర్కుక్ మండలానికి బదిలీ అయ్యారు. నారాయణరావు పేటలో డిప్యూటీ తహశీల్దార్ పని చేస్తున్న మాధవికి నంగునూరు తహశీల్దార్ గా పూర్తి బాధ్యతలు అప్పగిస్తూ సిద్దిపేట జిల్లా కలెక్టర్ హైమావతి ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో నంగునూరు తహశీల్దార్ కార్యాలయంలో ఆదివారం తహశీల్దార్ గా మాధవి బాధ్యతలు స్వీకరించారు. నూతన తహశీల్దార్ కు ఆర్ఐ లు పయ్యావుల లింగం, జయ సూర్య, కార్యాలయ సిబ్బంది, కంప్యూటర్ ఆపరేటర్లు నూతన తహశీల్దార్ కు శుభాకాంక్షలు తెలిపారు