ముదిగుబ్బ మండలం బూధనం పల్లి గ్రామంలో గ్రామ దేవత బూదలమ్మ ఆలయంలో ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత దొంగలు పడ్డారు. చాకచక్యంగా తలుపులు కున్న తాళాలు తొలగించి సీసీ కెమెరా డివిఆర్ ను ధ్వంసం చేసి హుండీలో ఉన్న సొమ్ము గర్భగుడిలో అమ్మవారి మెడలో ఉన్న నగలను దొంగలించినట్లు గుర్తించారు. ఈ ఘటనపై ముదిగుబ్బ పోలీసులు విచారణ చేస్తున్నారు.