ప్యాకేజీ విషయంలో ప్రభుత్వం ఏక పక్షంగా వ్యవహరిస్తూ అన్యాయం చేస్తుందని వైజాగ్, చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ నిర్వాసితులు బుధవారం అనకాపల్లి జిల్లా నక్కపల్లి తహశీల్దార్ కార్యాలయం వద్ద నిరసన తెలిపారు. వివిధ గ్రామాల నుంచి 745 మంది కుటుంబాలకు వేరేచోట ఇంటి స్థలం కేటాయించి తరలిస్తున్నారని సీఐటీయూ నేత అప్పలరాజు అన్నారు. వారికి రూ.25 లక్షలు ప్యాకేజీ ఇవ్వాలని డిమాండ్ చేయగా కేవలం రూ.8.98 లక్షలు మాత్రమే ఇస్తున్నారన్నారు.