ధర్మవరం మార్కెట్ యార్డ్ లో వ్యాపారస్తులకు రైతులకు సంబంధించి విశ్రాంతి భవనాలు శిథిలావస్థకు చేరుకున్నాయి.పెచ్చులు ఊడిపోయి కూలిపోయే స్థితిలో ఉండడంతో రైతులు వ్యాపారస్తులు అటువైపు వెళ్ళడానికి జంకుతున్నారు.1989 సంవత్సరంలో అప్పటి ధర్మవరం ఎమ్మెల్యే జీ నాగిరెడ్డి మంత్రిగా పనిచేసిన సమయంలో వ్యాపారస్తుల కోసం ఈ విశ్రాంతి భవనాలు ప్రారంభించారు.వీటి స్థానంలో కొత్తవి నిర్మించాలని వ్యాపారస్తులు రైతులు కోరుతున్నారు.