*జూబ్లీహిల్స్‌లో ...* *రూ. 100 కోట్ల విలువైన భూమికి విముక్తి* *2 వేల గజాల స్థలాన్ని కాపాడిన హైడ్రా* జూబ్లీహిల్స్ చెక్‌పోస్టుకు చేరువలో.. ప్రధాన రహదారికి ఆనుకుని.. ఆక్రమణలకు గురైన భూమిని హైడ్రా కాపాడింది. 2 వేల చదరపు గజాల విస్తీర్ణంలో ఉన్న ఈ భూమి విలువ దాదాపు రూ. 100 కోట్లవరకూ ఉంటుంది. రెండు దశాబ్దాలుగా అక్రమార్కుల చేతిలో కబ్జా అయిన భూమికి హైడ్రా సోమవారం విముక్తి కల్పించింది. జూబ్లీహిల్స్ కోపరేటివ్ హౌసింగ్ సొసైటీకి సంబంధించిన ఈ భూమి లే ఔట్ ప్రకారం ప్రజావసరాలకు ఉద్దేశించినది.