ప్రకాశం జిల్లాలో చిన్న బ్రహ్మయ్య హత్య ఘటన సంచలనం కలిగించింది. గురువారం హత్య ఘటనపై డిఎస్పి నాగరాజు మీడియాతో గురువారం సాయంత్రం 6 గంటలకు మాట్లాడారు. చిన్న బ్రహ్మయ్య హత్య ఘటన రాజకీయ కోణంలో జరగలేదని కేసు నమోదు చేసి లోతుగా విచారణ జరుగుతున్నట్లు డిఎస్పి నాగరాజు తెలిపారు. స్నేహితులతో కలిసి చిన్న బ్రహ్మయ్య బుధవారం రాత్రి మద్యం సేవించాడని తర్వాత గురువారం ఉదయం హత్యకు గురినట్లు తెలిపారు. స్నేహితులు ఇద్దరు ఇంటికి వెళ్లిన తర్వాత ఈ ఘటన జరిగిందని ఇప్పటికే క్లూస్ టీం డాగ్ స్క్వాడను రంగంలోకి దించినట్లు డీఎస్పీ నాగరాజు అన్నారు.