కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం మామిడాడ నుంచి ఏలేశ్వరం మండలం అప్పనపాలెం వెళ్లే రోడ్డుకి పునఃనిర్మాణానికి కోటి 20 లక్షల రూపాయలతో జగ్గంపేట ఎమ్మెల్యే టిటిడి బోర్డు సభ్యులు జ్యోతుల నెహ్రూ చేతుల మీదుగా ఆదివారం సాయంత్రం భూమి పూజ చేసి శిలాఫలకం ఆవిష్కరించి శంకుస్థాపన చేసారు. అనంతరం ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక పూర్తిస్థాయిలో గుంతలు లేని రహదారులు నిర్మిస్తూ పక్కా రోడ్లు వేయడం జరుగుతుందని అన్నారు.