విశాఖ టౌన్ కొత్త రోడ్డులోని శ్రీ జగన్నాథ స్వామి వారి దేవస్థానంలో శ్రీ జగన్నాథ రథయాత్ర మహోత్సవాల సందర్భంగా లోక కళ్యాణార్థం బలబద్ర,సుభద్ర సమేత శ్రీ జగన్నాథ స్వామి వారికి వైఖానస ఆగమ సాంప్ర దాయంలో శాంతి కళ్యాణం గురువారం సాయంత్రం ఘనంగా జరిగింది. మంగళ వాయిద్యాలు, వేద మంత్ర ములతో ఆలయ అర్చకులు రంగనాథ ఆచార్యులు, జగన్నాథచార్యులు, వేడుకగా శ్రీ జగన్నాథ స్వామివారి కల్యాణ మహోత్సవాన్ని నిర్వ హించారు. స్వామివారి కల్యాణంలో పాల్గొన్న భక్తులకు తీర్థ ప్రసాదములు అందజేశారు.