పత్తి కొనుగోళ్లు సాఫీగా జరిగేందుకు చర్యలు చేపట్టాలని రెవెన్యూ జిల్లా అదనపు కలెక్టర్ ఎస్ .శీను అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ లో వీడియో కాన్ఫరెన్స్ సమావేశ మందిరంలో వ్యవసాయ, మార్కెటింగ్, ప్రణాళిక శాఖల అధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ, జిల్లాలో పత్తి కొనుగోళ్లు పారదర్శకంగా జరిగేలా అవసరమైనా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. రైతులకు మద్దతు ధర (MSP) కింద తగిన ధర లభించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. కొనుగోలు కేంద్రాల్లో తూకం, చెల్లింపుల్లో పారదర్శకత పాటించాలని, రైతులకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా అన్ని సదుపాయాలు కల్పిం