రాయదుర్గం పట్టణంలో ఓ బాలుడు అదృశ్యమయ్యాడు. రాజీవ్ గాంధీ కాలనీలో నివాసం ఉంటున్న దళవాయి సురేష్, సునీత దంపతుల పెద్ద కుమారుడు మంజునాథ (14) పట్టణంలోని వినయశ్రీ ఇంగ్లీషు మీడియం పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నాడు. గురువారం ఉదయం పాఠశాలకు వెళ్లి వచ్చాడు. మద్యాహ్నం పాఠశాలకు వెళ్లకుండా అక్కడక్కడా తిరిగి సాయంత్రం ఇంటికి వచ్చాడు. పాఠశాలకు వెళ్లలేదని గమనించిన తల్లి సునీత ఆ బాలున్ని మందలించింది. ఆ బాలుడు ఇంటి నుండి వెళ్లిపోయాడు. బాలుడి ఆచూకీ కోసం కుటుంబ సభ్యులు వెతికారు. 3 రోజులుగా వివిధ ప్రాంతాల్లోనూ వెతికినా పలితం లేకపోయింది. ఆచూకి తెలిస్తే 9381562925 కు ఫోన్ చేసి తెలపాలని తల్లి కోరారు.