మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి కార్యక్రమాన్ని తాడిపత్రిలో వైసీపీ నేతలు బుధవారం నిర్వహించారు. వైసీపీ రాష్ట్ర కార్యదర్శి రమేశ్ రెడ్డి, ఫయాజ్ బాషా తదితర వైసీపీ నేతలు వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వైఎస్సార్ రాష్ట్ర ప్రజల కోసం చేసిన సేవలు చిరస్మరణీయమన్నారు. ఉచిత విద్యుత్, ఆరోగ్య శ్రీ, జలయజ్ఞం వంటి పథకాలతో ప్రజల మనసుల్లో చెరగని ముద్ర వేశారని అన్నారు.