అనంతపురం జిల్లా కేంద్రంలో జిల్లా కలెక్టరేట్ రెవెన్యూ భవనంలో సోమవారం నాలుగు గంటల పది నిమిషాల సమయంలో అనంతపురం జిల్లా అభివృద్ధి కమిటీ సమావేశంలో పాల్గొనడం జరిగింది.ఈ సందర్భంగా ఎమ్మెల్యే పరిటాల సునీత మాట్లాడుతూ రాప్తాడు నియోజకవర్గంలో పేరూరు డ్యామ్ కు జీడిపల్లి జలాశయం నుంచి నీటిని తరలించేందుకు 2018 జనవరి 24నఅప్పటి సీఎం చంద్రబాబు చేతుల మీదుగా 804 కోట్లతో పనులు ప్రారంభించడం జరిగిందని అయితే గత ప్రభుత్వం వల్ల పనులు నిలిచిపోవడం జరిగిందని ఇప్పటికైనా పనులు పూర్తి చేసి పేరూరు డ్యాంకు నీరు విడుదల చేయాలని జిల్లా అభివృద్ధి కమిటీ సమావేశంలో జిల్లా ఇన్చార్జి మంత్రి భరత్ ను పరిటాల సునీత కోరారు.