కనిగిరి పట్టణంలోని దేవాంగ నగర్ లో కొలువైన శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో స్వామివారి పల్లకి సేవోత్సవ కార్యక్రమాన్ని వేద పండితుల ఆధ్వర్యంలో శనివారం వైభవంగా నిర్వహించారు. పట్టణంలోని భక్తులు శ్రీ లక్ష్మీనరసింహస్వామి పల్లకి సేవలో పాల్గొని, స్వయంగా స్వామివారి పల్లకిని మోసి, కొబ్బరికాయలు కొట్టి, హారతులు పట్టి మొక్కులను తీర్చుకున్నారు. కార్యక్రమం అనంతరం భక్తులకు ఆశీర్వచనాలను అందజేసిన వేదపండితులు స్వామివారి తీర్థప్రసాదాలను పంపిణీ చేశారు.