కరీంనగర్ లోయర్ మానేరు జలాశయం లో నీరు 9 టీఎంసీ లకు చేరినట్లు ఆదివారం జలాశయం అధికారులు తెలిపారు. ఎల్ఎండి పూర్తి సామర్థ్యం 24 టీఎంసీ లు కాగా, మిడ్ మానేరు జలాశయం నుంచి ఆరు గేట్లు ఎత్తడం ద్వారా ఎల్ఎండి లోకి నీరు వచ్చి చేరుతుంది. ఎంఎంఆర్, ఎగువ కాకతీయ కెనాల్ కాల్వను కలుపుకొని 9,760 క్యూసెక్కుల నీరు ఎల్ఎండి లోకి వచ్చి చేరుతున్నట్లు తెలిపారు. అలాగే గంగాధర మండలంలోని కురిక్యాల వరద కాలువ ద్వారా మిడ్ మానేరు జలాశయంలోకి ప్రమాద స్థాయిలో నీరు ప్రవహిస్తుంది. మిడ్ మానేరులోకి భారీగా వరద నీరు చేరడంతో ఆరు గేట్ల ద్వారా కరీంనగర్ ఎల్ఎండి లోకి నీటిని దిగువకు అధికారులు విడిచిపెట్టారు.