చింతపల్లి డీఎఫ్వో నరసింగరావు ఆదేశాల మేరకు కొయ్యూరు మండలంలోని కాకరపాడు గురుకుల జూనియర్ కళాశాలలో శనివారం ఉదయం పెదవలస అటవీశాఖ అధికారులు, సిబ్బంది స్వచ్ఛాంధ్ర-స్వరాంధ్ర నిర్వహించారు. ఇందులో భాగంగా ప్రిన్సిపాల్ లక్ష్మణ్ తో కలిసి బీట్ ఆఫీసర్ గంగరాజు, ఏబీవో షణ్ముఖ్ తదితరులు కళాశాల ఆవరణలో చెత్తను తొలగించారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉన్నపుడే ఆరోగ్యకరమైన జీవనం సాధ్యమవుతుందని పేర్కొన్నారు. విద్యార్థులు పరిశుభ్రత పాటించాలన్నారు.