కుందేరు ఆధునికీకరణకు ప్రత్యేక ప్రణాళికను రూపొందిస్తున్నట్లు చీరాల ఎమ్మెల్యే కొండయ్య తెలిపారు.ఈ క్రమంలో కుందేరు సరిహద్దులు నిర్ణయించి,ఆ వాగులోని ఆక్రమణలు తొలగించే చర్యలు కూడా చేపడతామని ఆయన చెప్పారు.మంగళవారం కుందేరుపై ఆధికారులతో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించాక ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ చీరాల నియోజకవర్గాన్ని భారీ వర్షాలు,వరదల సమయంలో ముంపు నుండి కాపాడే కుందేరును యధాపూర్వస్థితికి తెస్తామన్నారు