సంగారెడ్డి జిల్లా ఆందోల్ నియోజకవర్గం లోని రాయికోడ్ మండలంలో బుధవారం ఉదయం నుండి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు రాయికోడ్ చౌరస్తా నుండి కుసునూరు వెళ్లే రహదారి మరియు యూసఫ్ పూర్ వాగు పొంగి పొర్లుతున్నందున ఆ వైపు వాగు దాటే ప్రయత్నం ప్రజలు చేయరాదని ఎస్సై చైతన్య కిరణ్ పలు సూచనలు చేశారు. అలాంటి వాగుల వద్ద పోలీసు సిబ్బంది ఉంచినట్లుఎస్సై తెలిపారు. అత్యవసర పరిస్థితిలో రాయికోడ్ పోలీస్ స్టేషన్ను సంప్రదించవలసిందిగా తెలిపారు.