ఉద్యోగ క్రమబద్దీకరనే లక్ష్యంగా సమగ్ర శిక్ష ఉద్యోగులు చేపడుతున్న సమ్మె ఆదిలాబాద్ లో మంగళవారం మంగళవారం 15వ రోజు చేరుకుంది.సీఎం తమకు ఇచ్చిన హామీని నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ రోజుకో రీతిన ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇందులో భాగంగా కలెక్టర్ కార్యాలయం ఎదుట రోడ్డును ఊడుస్తూ వినూత్నంగా నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలను గుర్తు చేస్తూ పరెద్ద ఎత్తున నిరసన నినాదాలతో హోరెత్తించారు.