వరంగల్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. లారీ ఢీ కొనడంతో పదేళ్ల బాలుడు మృతి చెందాడు. చెన్నారావుపేట మండలం పుల్లయ్య బొడు గ్రామానికి చెందిన భూక్య జ్యోతి వెంకన్న లకు ఒక కూతురు, కొడుకు ప్రవీణ్ (10) ఉన్నారు. వీరి ఇల్లు రహదారి పక్కనే ఉంది. మంగళవారం మధ్యాహ్నం రెండు గంటలకు గూడూరు నుంచి నెక్కొండ వైపుగా లారీ వేగంగా వస్తుంది. సరిగ్గా పుల్లయ్య బొడు తండా కి చేరుకోగానే ఈ రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా వచ్చిన లారీ ప్రవీణ్ ని బలంగా ఢీ కొట్టడంతో తల నుజ్జునుజ్జయింది. ఈ ప్రమాదంలో బాలుడు అక్కడికక్కడే మృతి చెందాడు.