మట్టి వినాయకుడిని పూజించి పర్యావరణాన్నిరక్షించాలని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. భీమవరం బ్యాంక్ కాలనీలోని మైత్రి కాలనీస్ వెల్పేర్ అండ్ డెవలప్ మెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు ఉచిత వినాయక పత్రిమాలు, వ్రత పూజ పుస్తకాలను ఎమ్మెల్యే రామాంజనేయులు పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రసాయన రంగులతో తయారు చేసిన విగ్రహాలతో పర్యావరణానికి తీవ్ర నష్టం జరుగుతోందని, మట్టి విగ్రహాలను ప్రతిష్ఠించుకుంటే కులవృత్తిపై ఆధారపడిన కుమ్మరులకు ఉపాధి లభిస్తుందన్నారు.