బిక్కనూరు మండలంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా పట్టణంలోని మూడు ఎంపీటీసీ స్థానాలకు సంబంధించిన నూతన ఓటరు తుది జాబితాను బుధవారం గ్రామ పంచాయతీ కార్యాలయంలో సిబ్బంది ప్రచురించారు. ఇటీవల విడుదల చేసిన ముసాయిదా జాబితాలోని తప్పులను సరిదిద్ది, ఈ తుది జాబితాను విడుదల చేసినట్లు పంచాయతీ కార్యదర్శి మహేశ్ గౌడ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో జూనియర్ అసిస్టెంట్ సిద్ధిరాములు, ఆపరేటర్ మహేశ్ తదితరులు పాల్గొన్నారు.