కామారెడ్డిలో వరద బాధిత కుటుంబాలను పరామర్శించడం కంటే సహాయం చేయడమే ముఖ్యమని మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ అన్నారు. భారీ వర్షాలకు కామారెడ్డి నియోజకవర్గంలో నలుగురు మృతి చెందడంపై ఆయన విచారం వ్యక్తం చేశారు. వాతావరణ శాఖ, అధికారులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకుని ఉంటే ఈ ప్రమాదం జరిగి ఉండేది కాదని ఆయన అభిప్రాయపడ్డారు. కేవలం పర్యటనలు, పరామర్శలు చేసి చేతులు దులుపుకోకుండా, సహాయం అందించాలని అన్నారు. వరద బాధిత కుటుంబాలకు కనీసం పునరవాసం కల్పించలేదని, మంత్రి సీతక్క తూతూ మంత్రంగా వరద బాధిత ప్రాంతంలో పర్యటించారు వారికి ఎలాంటి సహాయం చేయలేదన్నారు.