ఎన్నో పోరాటాలు, ప్రాణత్యాగాలతో సాధించుకున్న హక్కులను రక్షించుకుంటూ,నూతన హక్కులు సాదించుకుంటేనే యూనియన్ కొమురయ్యకు మనమిచ్చే ఘన నివాళి అని,ఆ దిశగా యూనియన్ కార్యకర్తలు కార్మికుల పక్షాననిలబడి పోరాడాలని సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్, కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు అన్నారు.సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ మాజీ ప్రధాన కార్యదర్శి, యూనియన్ వ్యవస్థాపక సభ్యులు,తెలంగాణ సాయుధ పోరాట యోధులు మనుబోతుల కొమురయ్య 29వ వర్దంతిని ఏఐటియుసి, సిపిఐ ఆధ్వర్యంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు.