కరీంనగర్ లోయర్ మానేరు డ్యాం లోకి భారీగా నీటి ప్రవాహం వస్తుందని అధికారులు గురువారం తెలిపారు. ఎగువ ప్రాంతాలలో భారీ వర్షాల వల్ల లోయర్ మానేరు డ్యాం లోకి మిడ్ మానేరు ద్వారా 43,000 క్యూసెక్కుల నీరు వస్తుందని,మోయ తుమ్మెద వాగు నుంచి వరద ప్రవాహం 8,097 క్యూసెక్కులు వస్తుందని తెలిపారు. ఎల్ఎండి రిజర్వాయర్ పూర్తి సామర్థ్యం 24 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 13. 652 టీఎంసీలు నీటి నిల్వ ఉందని తెలిపారు. వరద ప్రవాహం ఇలాగే కొనసాగితే మరో రెండు రోజుల్లో రిజర్వాయర్ లో పూర్తి సామర్థ్యానికి నేటి నిలువ చేరుకుంటుందన్నారు.