యాదాద్రి భువనగిరి జిల్లా, భూదాన్ పోచంపల్లి మండల పరిధిలోని జూలూరు బ్రిడ్జి వద్ద రాత్రి హైదరాబాదులో కురిసిన భారీ వర్షాలకు మూసి వాగు ఉదృతంగా ప్రవహిస్తుంది. శుక్రవారం ఉదయం స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మూసి ఇవ్వకు ఉదృతంగా ప్రవహిస్తుండడంతో లో లెవెల్ బ్రిడ్జి పై గుర్రపు డెక్క ఆకు భారీగా పేరుకుపోయి వాహనాల రాకపోకలకు అవరోధంగా మారింది. అధికారులకు సమాచారం ఇవ్వడంతో సంఘటన స్థలానికి చేరుకొని, గుర్రపు డెక్క ఆకును తొలగించి వాహనాల రాకపోగాలను పునరుద్ధరించారు.