నల్గొండ జిల్లా కేంద్రంలోని గ్రంథాలయం ముందు గురువారం మధ్యాహ్నం BRSV ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొమ్మరబోయిన నాగార్జున మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం గ్రూపు-1 పరీక్షలను రద్దుచేసి మళ్లీ నిర్వహించాలని డిమాండ్ చేశారు. మూల్యాంకనంలో తప్పులు ఉన్నాయని, వాటిని పునర్విభజన చేసి పరీక్ష నిర్వహించాలని కోర్టు ఆదేశిస్తే, కాంగ్రెస్ ప్రభుత్వం కోర్టు ఆదేశాలను పట్టించుకోవడంలేదని మండిపడ్డారు.