ఎమ్మిగనూరు : గురజాలలో స్వచ్ఛాఆంధ్ర-స్వర్ణాంధ్ర కార్యక్రమం..నందవరం మండలం గురజాలలో ఎంపీడీవో పుల్లయ్య, తహశీల్దార్ శ్రీనివాసులు ఆధ్వర్యంలో స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్రపై శనివారం ప్రతిజ్ఞ చేయించారు. ఆయన మాట్లాడుతూ.. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకొని ప్రజలు ఆరోగ్యవంతంగా ఉండాలన్నారు. ఎవరూ ఖాళీ స్థలాలలో చెత్త, ప్లాస్టిక్ కవర్స్, బాటిల్స్ వేయకుండా మీ ఇంటికి వచ్చే హరిత రాయబారులకు మాత్రమే ఇవ్వాలని, ఆ విధంగా చేస్తే గ్రామం పరిశుభ్రంగా ఉంటుందని అన్నారు.