మతోన్మాదానికి, ఫాసిజానికి వ్యతిరేకంగా విద్యార్థులు ప్రగతిశీల ఉద్యమాలు నిర్వహించాలని పీడీఎస్యు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పూర్వ అధ్యక్షుడు ప్రదీప్ కుమార్ పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆదివారం మధ్యాహ్నం మంచిర్యాల పట్టణంలో నిర్వహించిన రాజకీయ శిక్షణ తరగతుల్లో ఆయన మాట్లాడుతూ బీజేపీ పార్టీ అధికారంలోకి వచ్చాక మతం పేరుతో ప్రజలపై దాడులకు పాల్పడుతోందని ఆరోపించారు. విద్యా రంగాన్ని తమ నియంత్రణలోకి తెచ్చుకోవడానికి అనేక మార్పులు చేసేందుకు ప్రయత్నిస్తోందని పేర్కొన్నారు.