మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలంలోని పొక్కురు గ్రామంలో మహారాష్ట్ర కు చెందిన తూముకూరి కిష్టస్వామి, గడ్డం వెంకటేష్ విస్తా అనే ఇద్దరు వ్యక్తులు నాటు పడవ కొనుగోలు చేసి దాన్ని సోమవారం ఉదయం గోదావరిలో నడుపుకుంటూ వెళ్తుండగా అన్నారం బ్రిడ్జి దగ్గర గేట్లు దాటుతున్న క్రమంలో ప్రవాహం తాకిడి ఎక్కువగా ఉండటం వల్ల బోటు తలకిందులై గడ్డం వెంకటేష్ నీళ్లలో మునిగి గల్లంతు కాగా తూముకూరు కిష్టస్వామి ఈత కొట్టుకుంటూ బయటకు చేరుకున్నాడు. దీంతో నీటిలో మునిగిన గడ్డం వెంకటేష్ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.