జిల్లా ఎస్పీ రోహిత్ రాజు లక్ష్మీదేవిపల్లి మండలంలోని జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ నందు జిల్లా పోలీస్ శాఖలో వినియోగిస్తున్న వాహనాలను శుక్రవారం తనిఖీ చేయడం జరిగింది.ఈ సందర్భంగా ఇట్టి వాహనాల డ్రైవర్లకు పలు సూచనలను చేశారు.నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండే క్రమంలో వాహనాల కండిషన్ ఎప్పటికప్పుడు మంచిగా ఉండేలా చూసుకోవాలని సూచించారు.విధుల పట్ల ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని,డ్రైవింగ్ చేసే సమయాల్లో పాటించే నియమ నిబంధనలను కచ్చితంగా అనుసరించాలని తెలిపారు..