ఇటీవల కురిసిన భారీ వర్షాలకు నారాయణపేట పట్టణంలోని నక్క రామయ్య కాలనీ రోడ్డు పూర్తిగా కొట్టుకుపోయిందని, భారీ వర్షాల కారణంగా ఇద్దరు పిల్లలు కొట్టుకుపోయి చెట్టును పట్టుకొని ఆగిపోయారని కాలనీవాసులు వాపోయారు. నారాయణపేట జిల్లా కేంద్రంలోని నక్క రామయ్య కాలనీలో ఎగువ భాగాల నుండి వచ్చే నీరు, ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతమైన నక్క రామయ్య కాలనీ రోడ్డు పూర్తిగా కొట్టుకుపోయిందని, తమను ఆదుకోవాలని కోరుతూ భీష్మరాజ్ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ కె.రాజ్ కుమార్ రెడ్డిని కోరారు. అందుకు స్పందించిన రాజ్ కుమార్ రెడ్డి ఫౌండేషన్ సభ్యులు, కాలనీవాసులతో కలిసి నక్క రామయ్య కాలనీలో ఉన్న వాగు ప్ర