మెడికల్ శానిటేషన్,సెక్యూరిటీ గార్డుల సమస్యలు తక్షణమే పరిష్కరించాలని ఏఐటియుసి జిల్లా అధ్యక్షులు రాజేష్ గౌడ్ డిమాండ్ చేశారు.ఏఐటియుసి అనుబంధ ఏపి మెడికల్ కాంట్రాక్ట్ ఎంప్లాయిస్ & వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఈ రోజు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి ప్రధాన ద్వారం ముందు ధర్నా నిర్వహించారు.ఈ సందర్బంగా రాజేష్ గౌడ్ మాట్లాడుతూ గత నాలుగు సంవత్సరాల నుండి శానిటేషన్ కాంట్రాక్టర్ గా ఉన్న ఏ1 స్పెసిలిటీ వారు కార్మికులకు ఇవ్వాల్సిన వేతనాలు సరిగా ఇవ్వకుండా చాలా ఇబ్బందులకు గురిచేశారన్నారు,కార్మికుల హక్కుగా భావించే ఈపిఎఫ్ సగం కూడా జమచేయట్లేదన్నారు.