చిత్తూరు జిల్లా పుంగనూరు పట్టణంలో ఆదివారం మధ్యాహ్నం 12 గంటల ప్రాంతం నుంచి వినాయకుల నిమజ్జనాలు కోలాహలంగా సాగాయి. యువకుల నృత్యాలు, బళ్లారి డ్రమ్స్ తో పట్టణ పురవీధులు దద్దరిల్లాయి. గత కొద్ది రోజుల పాటు పూజలు అందుకున్న గణపతి ప్రతిమలను నిమజ్జనానికి తరలించారు. నానాబాల ముని వెంకటమ్మ వీధిలో కొలువు తీర్చిన గణనాధుని ప్రతిమను. శ్రీవీ సమాజ్ ఆధ్వర్యంలో పట్టణ వీధుల్లో ఊరేగిస్తూ గంగాదేవి ఒడికి తీసుకువెళ్లారు. ఈ కార్యక్రమంలో మహిళలు నృత్యాలు విశేషంగా ఆకట్టుకున్నాయి